Wednesday, May 6, 2026
Home Blog

బ్యాంకుల భద్రతపై అవగాహన సమావేశంఅనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

0

ఏ2డిజిటల్ న్యూస్, మే6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలోని బ్యాంకుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, గోల్డ్ లోన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ అలారం సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే మెటల్ డిటెక్టర్లను కూడా అమర్చాలని చెప్పారు.బ్యాంకుల భద్రతా లోపాలను గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ బృందాలు జిల్లాలోని బ్యాంకులను తనిఖీ చేసి సీసీటీవీ వ్యవస్థలు, అలారం సిస్టమ్స్, భద్రతా సిబ్బంది పనితీరును సమీక్షించనున్నాయని చెప్పారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని బ్యాంకు యాజమాన్యానికి సూచించారు.బ్యాంకుల వద్ద అర్మ్డ్ గార్డులు, ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పని చేయని సీసీటీవీలను తక్షణమే బాగు చేయించుకోవాలని, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. అలారం సిస్టంను సమీప పోలీస్ స్టేషన్‌తో అనుసంధానం చేయాలని, మోషన్ సెన్సార్ కెమెరాలను అమర్చాలని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. ఇటీవల చోటుచేసుకుంటున్న దోపిడీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం అడిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

మెదక్ కేర్ హాస్పిటల్ సీజ్ చేసి కేసు నమోదు చేయాలి… సిపిఎం పార్టీ డిమాండ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే6, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

నవజాత శిశువును విక్రయం చేసిన కేర్ హాస్పిటల్ పై కేసు నమోదు చేసి,హాస్పిటల్ ను సీజ్ చేయాలని సీపీఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో జిల్లా ఏ ఓ యూనస్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి, కార్యదర్శి వర్గ సభ్యులు కె నర్సమ్మ ఏ, మల్లేశం మాట్లాడుతూ శిశువును విక్రయం చేసిన కేర్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి, హాస్పిటల్ను సీజ్ చేయాలని మెదక్ పట్టణంలోని కేర్ హాస్పిటల్లో పుట్టిన శిశువు మృతి చెందిందనితల్లిదండ్రులను మోసం చేసి శిశువును విక్రయం చేసిన కేర్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి, హాస్పిటల్ను సీజ్ చేయాలని సిపిఎం మెదక్ జిల్లా కమిటీ కోరుతుందన్నారు. గత నెల 12వ తేదీన పాపన్నపేట మండలం లక్ష్మినగర్ కు చెందిన నస్రా ఫాతిమా డెలివరీ కోసం మెదక్ పట్టణంలోని కేర్ హాస్పిటల్లో అడ్మిట్అయ్యారు. డెలివరీ వెళ్లిన శిశువు తల్లిదండ్రులకు పుట్టిన శిశువు మరణించిందని చెప్పి కోసం చేయడం జరిగింది. శిశువులను విక్రయించడం బి ఎన్ ఎస్ సెక్షన్ 370, 372, 373 మరియు జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 లోని సెక్షన్ 80, 81 ప్రకారం తీవ్రమైన నేరమని తెలిసినప్పటికీ హాస్పిటల్ యాజమాన్యం శిశువు విక్రయానికి ప్రోత్సాహించడం జరిగింది.ఈ నేరానికి పాల్పడిన వారిపై మరియు ప్రోత్సహించిన హాస్పిటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం కోరుతుందన్నారు.జిల్లాలో శిశువులను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెంచాలని సిపిఎం వారు అన్నారు. మెదక్ పట్టణంతో పాటు నర్సాపూర్, తుప్రాన్, చేగుంట, రామాయంపేట, పెద్దశంకరం పేట ప్రాంతాల్లో ఉన్న ప్రయివేట్ హాస్పిటల్పై ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని,జిల్లాలో జరుగుతున్న శిశువు విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం మెదక్ జిల్లా కమిటీ కోరుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు జె సంతోష్ పాల్గొన్నారు.

కామారం తండాలో అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎంపీడీవో దామోదర్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే6,చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

కామారం తండా లో ఉపాధి హామీ పనులతో పాటు నర్సరీ, ఇందిరమ్మ ఇండ్లను, మరియు వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎంపీడీవో దామోదర్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉపాధి పనుల ప్రదేశం వద్ద వెళ్లి ఉపాధి కూలీలతో మాట్లాడారు. గ్రామంలోని నర్సరీ ని సందర్శించి మొక్కలకు నీరు పాడిన చాలని తెలిపారు. మొక్కలు ఎండ వేడిమి కి వాడిపోకుండా చుట్టూ కంచె వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ హలవత్ మోహన్ నాయక్, పంచాయతీ సెక్రటరీ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

చెరువు కట్ట అభివృద్ధి పనులకు శ్రీకారం

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 6, మనోహర బాద్ ప్రతినిధి (రామకృష్ణ)

మనోహరాబాద్ మండలం పరిధిలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న చెరువు కట్ట అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఐటీసీ సంస్థ సహకారంతో చేపడుతున్న ఈ పనులను గ్రామ పాలకవర్గం, రైతులు, సంస్థ ప్రతినిధులు కలిసి భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు.ఈ అభివృద్ధి పనుల ద్వారా చెరువు కట్ట బలపడటంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాల మట్టం మెరుగుపడే అవకాశముందని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో రైతులకు సాగునీటి సమస్య కొంతవరకు తగ్గే అవకాశముందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ రైతులు మరియు పాలకవర్గ సభ్యులు ఐటీసీ సంస్థ ప్రతినిధులను అభినందించారు.

పేదలకు ఇందిరమ్మ ఇల్లు వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 6, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు భూమిపూజా కార్యక్రమంలో టెంకాయ కొట్టి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేష్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వరం లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న పథకాల ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

నిరుపేద వధువుకు పుస్తె మట్టలు పంపిణీ

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 6, చిన్న శంకరంపేట ( కమ్మరి దేవరాజు)

చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో ని నిరుపేద కుటుంబానికి చెందిన కాడిగళ్ల శ్యామల కూతురు దివ్య వివాహానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పుస్తె మట్టలు పంపగా కాంగ్రెస్ నాయకులు ముత్తిగళ్ళ రామచంద్రం, మాజీ ఉప సర్పంచ్ కర్నే సాయిలు, రాములు, నర్సింలు, నిరుపేద వధువు దివ్యకు పుస్తె మట్టల అందించారు.

ఈనెల 10 న ప్రధాని మోడీ సభను విజయవంతం చేయండి

0

ఏ 2 డిజిటల్ న్యూస్, మే6, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

ఈ నెల 10 వ తేదీన సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ ను బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాని విజయవంతం చేయాలని బిజెపి పటల అధ్యక్షులు పట్లోరి పోగుల రాజు నేడు ప్రకటనలో తెలిపారు. ఎలక్షన్లు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగంగా మూడు రాష్ట్రాలు పశ్చిమబెంగాల్ పుదుచ్చేరి అస్సాం మూడు రాష్ట్రాల్లో బిజెపి పార్టీ విజయదుందుభి మోగించిందని మోడీ నాయకత్వం లో భారతదేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోగుల రాజు జిల్లా నాయకులు మల్లా రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు భాగగౌని సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు ఆర్ నరేందర్ రెడ్డి, దశరథ్, జిల్లా నాయకులు డాక్టర్ గుడి కాడి లింగం గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, జిన్న మహేష్ సండ్రు మధు, ఐతర బోయిన మహేష్, రవీందర్, వడ్ల చంద్రమౌళి, ప్రసాద్ మ్యాకల రమేష్, శంకర్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో సంచలనం దళిత నాయకుడిగా విజయ్ దళపతి సీఎంగా ఎదుగుదల.

0

ఏ2 డిజిటల్ న్యూస్, మే6, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల కొత్త పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సినీ నటుడు విజయ్ నటుడు రాజకీయ రంగంలో వేగంగా ఎదుగుతున్న తీరు చర్చ నిశ్చయంగా మారిందని మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు దళిత రత్న అవార్డు గ్రహీత బొమ్మల మైసయ్య అన్నారు.స్వల్ప కాలంలోనే తన పార్టీకి గుర్తింపు తీసుకువచ్చి రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపించడం విశేషం.విజయ్ దళపతి వెతుకుదల దళిత సమాజానికి గర్వ కారణమని ఆయన పేర్కొన్నారు. ఒంటరి పోరాటంతో ముందుకు సాగుతూ, చరిత్రాత్మక విజయానికి దారి తీస్తుందన్నారని అభిప్రాయపడ్డారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్య క్రాంతిని ఆపలేమని అన్నట్టే ఎంతటి కుట్రలు జరిగిన విజయ్ విజయాన్ని ఆపలేరు అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలను అధిగమించి రాజకీయాల్లో నిలదొక్కుకోవడం యువతకు ఆదర్శనమని తెలిపారు సినీ రంగంలో గుర్తింపు పొందిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తమిళనాడురాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్నానంసంపాదించుకోవడం ప్రశాంసనియమని అన్నారు.యువతకు దేశనిర్దేశం చేస్తూ దళితుల రాజకీయ భాగస్వామ్యమని పెంచే దిశగా విజయ్ కృషి చేస్తారని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశంలో దళితులు రాజకీయంగా మరింత బలంగా ఎదగాలని కోరుతూ విజయ్ విజయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నంత శిఖరాలనుఅధిరోహించాలని కోరారు.

అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడుగా కార్యదర్శిగా కర్రే సత్తయ్య సుధాకర్ నియమాపకం

0

ఏ2డిజిటల్ న్యూస్, మే6, చిన్న శంకరంపేట (కమ్మరి దేవరాజు)

తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కర్రే పోచయ్య, జిల్లా సుధాకర్ మంగళవారం నియమాపకం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని తమ సేవలను గుర్తించి అంబేద్కర్ రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు రామచంద్రం నీ అమ్మ పత్రాలను అందజేశారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుదాం అన్నారు. బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ప్రమోషన్లతో బాధ్యతలు రెట్టింపు

0

– సేవల్లో మరింత నిబద్ధత అవసరం– మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2డిజిటల్ న్యూస్, మే 5, మెదక్ జిల్లా ప్రతినిధి ( రాము)

మెదక్: పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించే సిబ్బందికి తగిన గుర్తింపు ఎప్పటికప్పుడు లభిస్తుందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పదోన్నతులు లభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కానిస్టేబుల్ స్థాయి నుండి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన వారిలో హవేలీఘనపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన నరహరి, నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చెందిన మోహన్, మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన గోవర్ధన్, మెదక్ టౌన్ ట్రాఫిక్ విభాగానికి చెందిన తహెర్ అలీ ఉన్నారు. విధి నిర్వహణలో వారి అంకితభావం, కృషికి గుర్తింపుగానే ఈ పదోన్నతులు లభించాయని ఎస్పీ తెలిపారు.పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా వారికి కొత్త హోదా చిహ్నాలను అలంకరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “పదోన్నతులు కేవలం హోదాను మాత్రమే కాదు, బాధ్యతలను కూడా పెంచుతాయి. సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణే మన ప్రధాన లక్ష్యం” అని సూచించారు.విధి నిర్వహణలో నిజాయితీ, బాధ్యతతో పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగడం సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.